Chukkalanti ammayi Song Lyrics in Telugu from Abhinandana movie

గానం : జానకి 
రచన : ఆత్రేయ 
                            
చుక్కలాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ
చుక్కలాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ
ఇద్దరొద్దికైనారూ ముద్దు ముద్దుగున్నారూ
ఇద్దరొద్దికైనారూ ముద్దు ముద్దుగున్నారూ
చుక్కలాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ

ఈ పిల్లకు మనసైందీ ఆ కళ్ళకు తెలిసిందీ
ఆ పిల్లాడు వలచిందీ ఈ బుగ్గకు సిగ్గైందీ
కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నారూ
మేలోల్లంతా కలలే కన్నారూ
[పెళ్ళికి మాకేమిస్తారూ]
కొత్తబట్టలూ కుట్టిస్తారూ గుర్రం సాటు ఎక్కిస్తారూ
కొత్తబట్టలూ కుట్టిస్తారూ గుర్రం సాటు ఎక్కిస్తారూ
ఊరంతా ఊరేగిస్తారూ
చుక్కలాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ
ఇద్దరొద్దికైనారూ ముద్దు ముద్దుగున్నారూ
ఇద్దరొద్దికైనారూ ముద్దు ముద్దుగున్నారూ
చుక్కలాంటి అమ్మాయీ చక్కనైన అబ్బాయీ

ఒక బంధువు వచ్చాడూ తానొంటరినన్నాడూ
ఆ బంధం వేశాడూ సంబంధం చేశాడూ
ఆ పిల్ల అతనికి అనుకోకుండా ఇల్లాలయ్యిందీ
అనుకోకుండా ఇల్లాలయ్యిందీ
ఇన్నాళ్ళూ ప్రేమించిన పిల్లాడేమో పిచ్చోడైనాడూ
పిల్లాడేమో పిచ్చోడైనాడూ ....

0 comments:

Post a Comment