kannulu teriche Song Telugu Lyrics from Bommarillu Movie

గానం : దేవి శ్రీ ప్రసాద్ 
రచన : భాస్కరబట్ల రవి కుమార్ 
                        
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాము కాని ఇప్పుడు 
పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు 
ప్రేమ కోసం ఏకంగా తాజ్ మహలే కట్టారు షాజహాన్ కు పనిలేదా అనుకున్నాను  
ప్రేమ కన్నా లోకంలో గోప్పదేది లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను 
హో హో హో అరె ఇంతలో ఏదేదో జరిగిందిరో 
హో హో హో ఈ ప్రేమలో నేకుడా తడిసానురో 

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాము కాని ఇప్పుడు 
హే పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు 

హో ప్రేయసి ఊహల్లో లైఫంతా గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కాని ఇప్పుడు 
గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచని జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కాని ఇప్పుడు 
గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను 
మాటి మాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను 
హో హో హో అది ప్రేమని ఈ రోజే తెలిసిందిరో 
హో హో హో ఈ ప్రేమలో నే కూడా తడిశానురో 

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాము కాని ఇప్పుడు 

హో చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనే లేదు కాని ఇప్పుడు 
నీకోసం పుట్టి నీ కోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కాని ఇప్పుడు 
ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను 
ఇంత కాలం ఈ ఆనందం నేనొక్కడినే ఎందుకు మిస్సయ్యాను 
హో హో హో ఈ రోజులా ఏ రోజు అవలేదురో 
హో హో హో ఈ ప్రేమలో నేకూడా తడిసానురో 

కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాము కాని ఇప్పుడు 
హే పగలే వెన్నెల కాస్తుందని ప్రేమికులంటుంటే 
అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కాని ఇప్పుడు 

0 comments:

Post a Comment