Naa cheli rojave Song Lyrics from Roja Movie

Singers : SP Balasubramanyam, Sujatha
Lyrics : Rajasree       

నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే

కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడూ
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే

గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం
గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం
అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం
మేఘమాల సాగితే మోహకథలు జ్ఞాపకం
మనసు లేకపోతే మనిషి ఎందుకంటా
నీవు లేకపోతే బతుకు దండగంటా
కనిపించవో అందించవో తోడూ
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడూ

చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో
మమత దూరమాయెనే చందమామ రాలిపో
కురులు సిరులు లేవులే పూలవనం వాడిపో
తోడు లేదు గగనమా చుక్కలాగ రాలిపో
మనసులోని మాటా ఆలకించలేవా
వీడిపోని నీడై నిన్ను చేరనీవా
కనిపించవో అందించవో తోడూ
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే
కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే
కనిపించవో అందించవో తోడూ

0 comments:

Post a Comment