Prema Entha Madhuram Song Lyrics in Telugu from Abhinandana Movie

గానం : యస్. పి. బాలు 
రచన : ఆత్రేయ 
                          
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమించుటేనా నా దోషము
పూజించుటేనా నా పాపము
ఎన్నాళ్ళని  యదలో ముల్లు
కన్నీరుగ  కరిగే కళ్ళు
నాలోని నీ రూపము నా జీవనాధారము
అది ఆరాలి పోవాలి ప్రాణం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
నేనోర్వలేను  తేజము
ఆర్పేయరాదా  దీపము
 చీకటిలో కలిసేపోయి నా రేపటిని మరిచేపోయి
మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము
అపుడాగాలి  మూగ గానం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
చేసినాను ప్రేమక్షీర సాగర మదనం మింగినాను హలాహలం
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

0 comments:

Post a Comment