Chaka Chaka Saage Lyrics & Online Listing

Lyricist: Veturi
Singers: SP. Balasubramanyam

                         
చక చక సాగే చక్కని బుల్లెమ్మా
మిస మిస లాడే వన్నెల చిలకమ్మ
నీ పేరేమిటో.. నీ ఊరేమిటో..
నీ పేరేమిటో.. నీ ఊరేమిటో..
గలగల పారే ఏరే నా పేరు
పొంగులు వారే వలపే నా ఊరు
చినదానను.. నే చినదానను..
చినదానను.. నే చినదానను..

కన్నులు చెదిరే వన్నెల చిలకా నీ వయసే ఎంత
కన్నులు చెదిరే వన్నెల చిలకా నీ వయసే ఎంత
చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంత
ఊహకు రానంత...
అందీ అందక ఊరించే నీ మనసులోతెంత..హా
మమతే ఉంటే దూరమెంతో లేదు
నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది

కసి కసి చూపులు చూసే సోగ్గాడా
ముసి ముసి నవ్వులు విరిసే మొనగాడా
నీ పేరేమిటో.. నీ ఊరేమిటో..
నీ పేరేమిటో.. నీ ఊరేమిటో..
పదమును పాడే వేణువు నా పేరు
మధువులు చిందే కవితే నా ఊరు
చినవాడను.. నే నీవాడను..
చినవాడను.. నే నీవాడను..

వరసలు కలిపే ఓ చినవాడా నీ వలపే ఎంత
విలువే లేనిది వెలకే రానిది వలపే కొండంత
నా వలపే జీవితమంత..
నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంట..హో
గుండెల గుడిలో దేవివి నీవంట
సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంట

చల్లని గాలి సన్నాయి ఊదింది
పచ్చిక వెచ్చని పానుపు వేసింది
కల నిజమైనది ప్రేమ ఋజువైనది
కల నిజమైనది ప్రేమ ఋజువైనది

0 comments:

Post a Comment