Vayasu vayasu Song Lyrics & Video Song from Gang Leader Movie

వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసనున్నది వాటం

ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిళి భోజనం
సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం
మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం
తొలివలపుల సంతర్పణం
మరెందుకాలస్యం
ప్రియమారా దరిచేరా బిగువేరా
సరసకు రారా వీరా ధీరా

వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

నీవేలేని నేనట నీరేలేని యేరట
కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ
తారా తారా సందున ఆకాశాలే అందునా
నీకు నాకు వంతెన
అమాస వెన్నెలలో
పరువాన స్వరవీణ మృదుపాణి
సరస మధురమయ లావణి పలికిన

వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
ప్రతిసారి వేసారి శృతిమీరే
సుఖమయ ఋతువుల మధువులనడిగిన
వయసు వయసు వయసు వరసనున్నది వాటం
తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం

0 comments:

Post a Comment