Eduta neeve song lyricsin Telugu from abhinandana

గానం : యస్. పి. బాలు 
రచన : ఆత్రేయ 
ఎదుటా నీవే యదలోనా నీవే (2)
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే
మరుపే తెలియని నా హృదయం
తెలిసి వలచుట తొలి నేరం అందుకే  గాయం (2)
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాడ్ని కానీదు
ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను (2)
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యం ఐతే వింత సత్యం స్వప్నం అయ్యేదుందా ప్రేమకింత బలముందా
ఎదుటా నీవే యదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే యదలోనా నీవే

0 comments:

Post a Comment