Prema ledani song lyrics in Telugu from Abhinandana

గానం : యస్. పి. బాలు 
రచన : ఆత్రేయ 
                               

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
 ప్రియా జోహారులు (2)
మనసు మాసిపోతే మనిషే కాదది
కఠికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదది
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటిని
ప్రేమ లేదని లలలాలలాల
గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులుపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించని
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
 ప్రియా జోహారులు

0 comments:

Post a Comment