Mata rani mounamidi song lyrics & Online Listening from Maharshi movie


 Singer : Balu, Janaki

         Lyrics : Athreya

మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
గానం ఇది నీ ధ్యానం ఇది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది

ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
ఈ మౌన రాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం
నింగీ నేల కూడే వేళ నీకు నాకు దూరాలేల

అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది

చైత్రాన కూసేను కోయిలమ్మ గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంతా నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మా
రాగాల తీగల్లో వీణా నాదం కోరింది ప్రణయ వేదం
వేశారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతో దూరం

మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది
కూడనిది జతకూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది

0 comments:

Post a Comment