Sahasam naa padam song lyrics & Online Listening from Maharshi movie


Singer : Balu

       Lyrics : Athreya


సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

నిశ్చయం నిశ్చలం నిర్బయం నా హయాం హా

కానిదేముంది నే కోరుకుంటే బూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసుపడితే ఏ కళలనైనా
ఈ చిటిక కొడుతూ నే పిలవనా

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా

అదరనీ బెదరని ప్రవృత్తి ఒదగనీ మదగజమే మహర్షి

వేడితే లేడి ఒడి చేరుతుందా..వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం..కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందిలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోనూ..రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలుపెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం

సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావడం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాశనం దాటడం సఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిటిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రథం
సాగితే ఆపడం సాధ్యమా

0 comments:

Post a Comment