Lyricist: Atreya
చిన్న మాట.. ఒక చిన్న మాట
చిన్న మాట.. ఒక చిన్న మాట
చిన్న మాట.. ఒక చిన్న మాట
సందె గాలి వీచె సన్నజాజి పూచె
జలధరించే చల్లని వేళ
చిన్న మాట.. ఒక చిన్న మాట
ఆ.. చిన్న మాట.. ఒక చిన్న మాట
రాక రాక నీవు రాక వలపు యేరువాక
నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా
నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్విలిస్తే పూజ చేస్తా
వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు
మాట.. మాట..
చిన్న మాట.. ఒక చిన్న మాట
ఆ.. చిన్న మాట.. ఒక చిన్న మాట
కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయె
నీ వాలు చూపే నీలల మెరుపై విరితేనెలే వెల్లువాయె
అందమంతా ఆరబోసి మల్లె పూల పానుపేసి
వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు
మాట.. మాట..
చిన్న మాట.. ఒక చిన్న మాట
ఆ.. చిన్న మాట.. ఒక చిన్న మాట
సందె గాలి వీచె సన్నజాజి పూచె
సందె గాలి వీచె సన్నజాజి పూచె
జలధరించే చల్లని వేళ
చిన్న మాట.. ఒక చిన్న మాట
ఆ.. చిన్న మాట.. ఒక చిన్న మాట
0 comments:
Post a Comment