Lyricist: Veturi
Singers: P Suseela
నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా
నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యావేణువు విందామని నీతో ఉందామని
నీ రాధ వేచేనయ్యా రావయ్యా
ఓ..ఓ..ఓ.. గిరిధరా మురహరా రాధా మనోహరా..ఆ..
నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా
రావయ్యా...
నీవు వచ్చే చోట నీవు నడిచే బాట
మమతల దీపాలు వెలిగించాను
మమతల దీపాలు వెలిగించాను
కుశలము అడగాలని పదములు కడగాలని
కన్నీటి కెరటాలు తరలించాను
ఓ..ఓ..ఓ.. గిరిధరా మురహరా నా హృదయేశ్వరా..ఆ..
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా
నీ రాధ గుండెలలో తాపము చల్లార్చ రా
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా..
కృష్ణయ్యా.. ఓ కృష్ణయ్యా..
నీ పద రేణువునైనా పెదవుల వేణువునైనా
బ్రతుకే ధన్యమని భావించాను
బ్రతుకే ధన్యమని భావించాను
నిన్నే చేరాలని నీలో కరగాలని
నా మనసే హారతిగా వెలిగించాను
గోవింద గోవింద గోవింద గోపాలా...
0 comments:
Post a Comment