Mallepuvvulaa Vasantam Song Lyrics & Online Listing

Lyricist: Veturi
Singers: SP. Balasubramanyam

                    
ఓ...ప్రియా..
మరుమల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మరుమల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకుని మురిసితిని
అధి విషమని చివరకు తెలిసినది

సఖియా..ఆ..ఆ..
నీవెంతటి వంచన చేశావు
సిరి సంపదకమ్ముడు పోయావు
విడనాడుట నీకు సులభం
విడనాడుట నీకు సులభం
నిన్ను విడువదులె నా హృదయం

ఓ...ప్రియా..
మరుమల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకుని మురిసితిని
అధి విషమని చివరకు తెలిసినది

తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
తొలి ప్రేమకు ఫలితం కన్నీరు
విరహానికి ఫలితం నిట్టూర్పు
చెలి చేసిన గాయం మానదులే
చెలి చేసిన గాయం మానదులే
చెలరేగే జ్వాల ఆగదులే

ఓ...ప్రియా..
మరుమల్లియ కన్నా తెల్లనిది
మకరందం కన్నా తీయనిది
మన ప్రణయం అనుకుని మురిసితిని
అధి విషమని చివరకు తెలిసినది
ఓ...ప్రియా..

0 comments:

Post a Comment